India: ఒక ఇంచు భూభాగాన్ని కూడా మేము ఆక్రమించలేదు.. యుద్ధానికి రెచ్చగొట్టలేదు: చైనా

We never proveked any country for war says China
  • పొరుగుదేశాలతో శాంతినే కోరుకుంటాం
  • ఇరు దేశాలు సంయమనం పాటించాలి
  • పరిస్థితి దిగజారకుండా భారత్ చూడాలి
పొరుగు దేశాలతో తాము ఎప్పుడూ శాంతిసామరస్యాలను కోరుకుంటామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. ఏ దేశాన్ని కూడా యుద్ధం దిశగా తాము రెచ్చగొట్టలేదని... ఏ దేశానికి చెందిన ఇంచు భూభాగాన్ని కూడా ఆక్రమించలేదని చెప్పారు. సరిహద్దులను దాటి తమ బలగాలు ఏ దేశంలోకి చొచ్చుకుపోలేదని అన్నారు. వాస్తవాధీనరేఖ వద్ద చైనా, భారత్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఇరు దేశాలు సంయమనం పాటించాలని చున్యింగ్ తెలిపారు. సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు యత్నించాలని చెప్పారు. లడఖ్ సరిహద్దుల్లో చైనా బలగాలను భారత సైన్యం నిలువరించిన రెండు రోజుల తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేలా భారత్ వ్యవహరిస్తోందని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారేలా భారత్ వ్యవహరించకూడదని కోరారు.

మరోవైపు ఇండియాలో చైనా రాయబార కార్యాలయానికి చెందిన ప్రతినిధి జీరోంగ్ మాట్లాడుతూ, శాంతికి విఘాతం కలిగించేలా భారత బలగాలు వ్యవహరించాయని ఆరోపించారు. రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో... నిన్న భారత బలగాలు ఉల్లంఘనలకు పాల్పడ్డాయని.... వాస్తవాధీనరేఖను అతిక్రమించాయని చెప్పారు. తమ బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని... దీంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయని అన్నారు.
India
China
LAC

More Telugu News