Chandrababu: మండలి చైర్మన్ కు కరోనా పాజిటివ్ రావడం పట్ల విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేశ్

Chandrababu and Lokesh saddened after Council Chairman MA Sharif tested corona positive
  • ఏపీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ కు కరోనా
  • త్వరగా కోలుకోవాలన్న టీడీపీ అగ్రనేతలు
  • రాష్ట్రానికి షరీఫ్ సేవలు అవసరం అంటూ వ్యాఖ్యలు
ఏపీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ కరోనా బారినపడ్డారు. షరీఫ్ కు కరోనా పాజిటివ్ రావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. షరీఫ్ సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన మరింతగా పుంజుకుని రావాలని, రాష్ట్రానికి ఆయన సేవలు అవసరమని పేర్కొన్నారు.
Chandrababu
Nara Lokesh
MA Sharif
AP Legislative Council
Andhra Pradesh

More Telugu News