చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన రాజీవ్ కుమార్ 

01-09-2020 Tue 15:09
  • రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
  • కేంద్రంలో ఎన్నో బాధ్యతలను నిర్వహించిన అనుభవం
  • గత నెల 18 న రాజీనామా చేసిన అశోక్ లావాస
Rajiv Kumar took charge as CEC
మన దేశ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్... ఝార్ఖండ్ కేడర్ కు చెందినవారు. 30 ఏళ్లకు పైగా ఎన్నో కీలకమైన బాధ్యతలను ఆయన నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల్లో ఆయన సేవలు అందించారు. కేంద్ర ఆర్థికశాఖలో ఖర్చుల విభాగానికి సంబంధించి జాయింట్ సెక్రటరీ, ఆ తర్వాత అడిషనల్ సెక్రటరీగా కూడా పని చేశారు. సీఈసీగా అశోక్ లావాస గత నెల 18న రాజీనామా చేశారు. అనంతరం రాజీవ్ కుమార్ ను నూతన చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.