Tollywood: విడాకులు తీసుకున్న టాలీవుడ్ యువ జంట.. ట్విట్టర్‌లో ప్రకటించిన నటుడు, హీరోయిన్!

tollywood young couple takes divorce
  • ప్రేమించుకుని, గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో పెళ్లి
  • 6 నెలలకే నోయెల్‌, ఎస్తే‌ర్ మధ్య విభేదాలు  
  • గ‌త ఏడాది జూన్‌లో ఇద్ద‌రూ విడాకుల కోసం దరఖాస్తు  
  • కోర్టు విడాకులు మంజూరు చేస్తున్న‌ట్లు తీర్పు
ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమించుకుని గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు, గాయకుడు నోయెల్‌, హీరోయిన్ ఎస్తే‌ర్ తాజాగా విడాకులు తీసుకున్నారు. వారిద్దరు తమ ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. పెళ్లి చేసుకున్న వారిద్దరి మ‌ధ్య ఆరు నెల‌ల‌కే విభేదాలు రావడంతో గ‌త ఏడాది జూన్‌లో ఇద్ద‌రూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో తాజాగా వీరిద్ద‌రికీ కోర్టు విడాకులు మంజూరు చేస్తున్న‌ట్లు తీర్పునిచ్చింది. త‌న‌కు సమస్యలు తలెత్తిన నేపథ్యంలో అండ‌గా నిలిచిన స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నోయెల్ పేర్కొన్నాడు. మరోవైపు,  తాను అన్ని విష‌యాల్లో సూటిగా, నిజాయ‌తీగా ఉంటాన‌ని ఎస్తర్ చెప్పుకొచ్చింది.

తమ విడాకులపై ఇంత కంటే ఎక్కువ‌గా స్పందించ‌లేన‌ని చెప్పుకొచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' సినిమాలోనూ ఎస్త‌ర్ నటించిన విషయం తెలిసిందే. ఆమెకి ప్రస్తుతం హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించే అవకాశాలు వస్తున్నాయి.
Tollywood
divorce
marriage

More Telugu News