Narendra Modi: మోదీ 'మన్ కీ బాత్'కు రికార్డు స్థాయిలో డిస్ లైక్ లకు కారణం ఇదే!

Reason Behind Record Dislikes for Modi Mann Ki Baat
  • ఆదివారం నాడు మోదీ ప్రసంగం
  • నీట్, జేఈఈ ప్రస్తావన లేకపోవడంతో విద్యార్థుల అసంతృప్తి
  • వీడియోపై కామెంట్లలో అత్యధికం ఇదే
గత ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, జాతిని ఉద్దేశించి, ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా చేసిన 'మన్ కీ బాత్' ప్రసంగానికి రికార్డు స్థాయిలో డిస్ లైక్ లు వచ్చిన సంగతి తెలిసిందే. మోదీ వీడియోను బీజేపీ తన అధికారిక యూ ట్యూబ్ చానెల్ లో పెట్టగా, 8.50 లక్షలకు పైగా డిస్ లైక్స్ నమోదయ్యాయి. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నదని బీజేపీ ఆరోపణలు చేసినప్పటికీ, కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణకు కేంద్రం పూనుకోవడం, ఈ పరీక్షల గురించి మోదీ ప్రస్తావించక పోవడం యువతలో ఆగ్రహాన్ని పెంచి, దాన్ని ఇలా డిస్ లైక్ ల రూపంలో చూపిందని తెలుస్తోంది.

పలు రాష్ట్రాలు నీట్, జేఈఈ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని పట్టుబట్టినా, కేంద్రం సుముఖత వ్యక్తం చేయని సంగతి తెలిసిందే. దీంతో లక్షలాది మంది విద్యార్థులు, తమ అసంతృప్తిని ఇలా వ్యక్తం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో అత్యధికం, పరీక్షలను వ్యతిరేకిస్తూ ఉన్నవే కావడం గమనార్హం. కాగా, నేటి నుంచి ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ, పరీక్షలను సజావుగా ముగించేలా చూసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
Narendra Modi
Mann Ki Baat
Dis Likes
Exams

More Telugu News