Centre: ప్రణబ్ మరణం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

  • దేశవ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలు
  • ప్రణబ్ సేవలు స్మరణీయం అంటూ కేంద్రం నిర్ణయం
  • రాష్ట్రపతి భవన్ పై జాతీయ జెండా అవనతం
Centre has taken a key decision on Pranab Mukherjee demise

దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించింది. ప్రణబ్ అందించిన సేవల దృష్ట్యా ఈ నిర్ణయం సముచితమని కేంద్రం భావిస్తోంది. ప్రణబ్ కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అటు, ప్రణబ్ మృతితో రాష్ట్రపతి భవన్, ఇతర కార్యాలయాలపై ఉన్న జాతీయ పతాకాలను అవనతం చేశారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలైన ప్రణబ్ ముఖర్జీకి శస్త్రచికిత్స జరుపగా, ఆయన పరిస్థితి విషమించింది. దానికితోడు కరోనా సోకడంతో ఆయన కోలుకోలేకపోయారు.

More Telugu News