హిందూపురంలో బాలకృష్ణ సందడి... ఫొటోలు ఇవిగో!

31-08-2020 Mon 17:17
  • సొంత నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటన
  • ఎడ్లబండి నడిపిన వైనం
  • పగ్గాలు చేతబట్టి ఎడ్లను అదలించిన బాలయ్య
MLA Balakrishna toured in his Hindupur constituency

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి చూపించే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ముందువరుసలో ఉంటారు. తాజాగా ఆయన ఎమ్మెల్యే హోదాలో హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎడ్లబండిపై సందడి చేశారు. స్వయంగా పగ్గాలు అందుకుని ఎడ్లను అదలించి, బండి నడిపారు. అంతేకాదు, ఆ బండికి కట్టిన గిత్తలను ఆత్మీయంగా స్పృశించి తమ పూర్వీకుల రైతు నేపథ్యాన్ని చాటారు.

అటు, హిందూపురంలో ఆయన పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటించారు. ముఖానికి మాస్కుతో పాటు ముఖం మొత్తం కవర్ చేసేలా షీల్డు, చేతులకు గ్లోవ్స్ తో కనిపించారు.

ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఆ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమాకు టార్చ్ బేరర్, మోనార్క్ అనే టైటిళ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో నడుస్తోంది. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ చిత్రాలు రాగా, ఇది మూడోది.