Nara Lokesh: గన్ కంటే ముందే వస్తాడన్న జగన్ ఎక్కడ?: నారా లోకేశ్

Nara Lokesh asks where is Jagan after a story emerged in media
  • అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటూ మీడియాలో కథనం
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • మహిళా హోంమంత్రి, దిశా చట్టం ఎక్కడ? అంటూ లోకేశ్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో సగటున రోజుకు 3 అత్యాచారాలు జరుగుతున్నాయని, దిశ చట్టం ఉన్నా లైంగిక దాడులు ఆగడంలేదని, హోంమంత్రి సొంత జిల్లాలోనే భారీగా అత్యాచార కేసులు వస్తున్నాయంటూ మీడియాలో ఓ కథనం వచ్చింది. ఈ కథనం నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. మహిళలను ఆదుకునేందుకు గన్ కంటే ముందే వస్తాడన్న జగన్ ఎక్కడ? అంటూ సెటైర్ వేశారు. మహిళా హోంమంత్రి ఎక్కడ? దిశా చట్టం ఎక్కడ? అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

Nara Lokesh
Jagan
Home Minister
Assaults
Women

More Telugu News