తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ క్లాసులు... టైమ్ టేబుల్ ఇదిగో!
- 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాసులు
- ఉదయం 10.30 గంటలకు క్లాసులు ప్రారంభం
- అరగంటకు మించకుండా ఒక్కో క్లాసు
3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులను నిర్వహించనున్నారు. ఒక్కో క్లాసు సమయం గరిష్ఠంగా అరగంట ఉంటుంది. ఇంటర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహించనున్నారు. విద్యార్థులందరూ క్లాసులను ఉపయోగించుకునేలా చూసే బాధ్యత టీచర్లదేనని చెప్పారు.