Ambati Rambabu: ఏ స్థాయి విచారణకైనా నేను సిద్ధం: అంబటి

I am ready to face any inquiry says Ambati Rambabu
  • అంబటిపై అక్రమ మైనింగ్ ఆరోపణలు
  • హైకోర్టులో నమోదైన పిటిషన్
  • అవినీతికి తాము దూరమన్న అంబటి
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై ట్విట్టర్ ద్వారా అంబటి స్పందిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలపై ఏ స్థాయి విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పారు. రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ, అక్రమ మైనింగ్ చేసినవారే పిటిషన్ వేసి తనను అల్లరి చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తమ వ్యతిరేక మీడియా, విపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అక్రమాలకు, అవినీతికి తాము దూరమని చెప్పారు. వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయని చెప్పారు.
Ambati Rambabu
YSRCP
Illegal Mining

More Telugu News