nayanatara: 'హీరోయిన్‌ నయనతారతో పెళ్లి' వార్తలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

vignesh gives clarity on his marriage news
  • న‌య‌న‌తారతో దర్శకుడు విఘ్నేశ్ ప్రేమాయణం 
  • ఇప్పట్లో పెళ్లి జరగబోదని స్పష్టం
  • ప్ర‌స్తుతం కెరీర్‌పైనే దృష్టి సారించామని వ్యాఖ్య
సినీ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్‌తో హీరోయిన్ న‌య‌న‌తార ప్రేమాయణం కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. వీరు జంటగా పలు చోట్ల కనపడిన ఫొటోలు తరుచూ బయటకు వస్తున్నాయి. దీంతో వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటిదేమీ లేదని విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నయనతారతో తన వివాహం గురించి అంద‌రూ అడుగుతున్నారని, మరోపక్క త్వ‌ర‌లోనే తాము పెళ్లి చేసుకోబోతున్నామనీ కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఇందులో నిజం లేదని, తాము ప్ర‌స్తుతం కెరీర్‌పైనే దృష్టి సారించి పనులు చేసుకుంటున్నామని చెప్పాడు.

తాము కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నామని, వివాహం అనంతరం వాటిని అందుకోవడం కంటే ముందే సాధిస్తే బాగుంటుంద‌ని తాము భావిస్తున్నామని విఘ్నేశ్ తెలిపాడు. ఈ కారణంగానే తాము వివాహం గురించి ప్ర‌స్తుతం ఆలోచించ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు.
nayanatara
marriage

More Telugu News