Gas Cylinder: వంటగ్యాస్ డెలివరీలో అక్రమాలకు కళ్లెం.. ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ!

  • గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న కంపెనీలు
  • గ్యాస్ బుకింగ్ సమయంలో వచ్చే ఓటీపీ చెబితేనే డెలివరీ
  • డిజిటల్ చెల్లింపులకు పెద్ద పీట
New rules on Gas Cylinder delivery

వంటగ్యాస్ డెలివరీలో బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించేందుకు ఆయిల్ కంపెనీలు రెడీ అయ్యాయి. వినియోగదారుల ధ్రువీకరణతోనే ఇకపై గ్యాస్ సిలిండర్ జారీ చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా గ్యాస్ బుకింగ్ చేసే సమయంలో వినియోగదారుడి మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీని చెబితేనే డెలివరీ చేయనున్నారు.

డెలివరీ బాయ్‌కు ఓటీపీ చెప్పిన వెంటనే అతడు తన వద్ద ఉండే ఫోన్‌లో నమోదు చేసుకుంటాడు. ఫలితంగా గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుడికే సిలిండర్ అందుతుంది. దీంతోపాటు ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లించే వెసులుబాటును కూడా ఆయిల్ కంపెనీలు కల్పిస్తున్నాయి. అలాగే, గ్యాస్ బుకింగ్‌ల కోసం ఇటీవల యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ ద్వారా గ్యాస్ బుక్ చేసిన వారికి రూ. 50 రాయితీ లభిస్తుంది.

మరోవైపు ఏజెన్సీలు కూడా డిజిటల్ బాట పట్టాయి. వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబరు ద్వారా ఏజెన్సీల వాట్సాప్ నంబరుకు ‘హాయ్’ అని మెసేజ్ పంపిన వెంటనే అటునుంచి స్పందన వస్తుంది. బుకింగ్ చేసుకోవడంతోపాటు నగదును డెబిట్, క్రెడిట్, బ్యాంకు ఖాతా నుంచి చెల్లించవచ్చు. ఇక, ఫోన్‌పే, గూగుల్ పే వంటివి ఉండనే ఉన్నాయి.

More Telugu News