Dead Body: గోనెసంచిలో వృద్ధురాలి మృతదేహం... బంజారాహిల్స్ లో కలకలం!

Dead body found at Banjara Hills footpath in Hyderabad
  • దుప్పటిలో చుట్టి ఉన్న మృతదేహం
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
  • సీసీ టీవీ కెమెరా ఫుటేజి పరిశీలించనున్న పోలీసులు
కరోనా వైరస్ భూతం విలయతాండవం చేస్తున్న వేళ హైదరాబాదు బంజారాహిల్స్ లో ఫుట్ పాత్ పై కనిపించిన ఓ మృతదేహం తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఇక్కడి రోడ్ నెం.2లో ఓ గోనెసంచి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అందులో ఓ వృద్ధురాలి మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. కరోనా ప్రభావం నేపథ్యంలో, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆ గోనెసంచి తెరిచారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఆ మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి, గోనెసంచిలో ఉంచి అక్కడ ఎవరో వదిలి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ కరోనాతో చనిపోతే ఆ విధంగా వదిలేసి వెళ్లారేమో అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ కెమెరా ఫుటేజిని పరిశీలిస్తే ఏమైనా ఆధారాలు లభ్యం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని బంజారాహిల్స్ పోలీసులు అంటున్నారు.
Dead Body
Footpath
Banjara Hills
Hyderabad
Police

More Telugu News