Bandi Sanjay: అవినీతిలో కూరుకుపోయిన సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: బండి సంజయ్

Bandi Sanjay fires in CM KCR and TRS Government
  • కార్పొరేట్ ఆసుపత్రులతో సర్కారు కుమ్మక్కయ్యిందని వ్యాఖ్యలు
  • రైతులను ఆదుకోవాలని డిమాండ్
  • రైతుబంధు పథకానికి బీజేపీ వ్యతిరేకం కాదన్న సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ధ్వజమెత్తారు. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులతో కేసీఆర్ ప్రభుత్వం కుమ్మక్కయ్యిందని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేసిన ఒకట్రెండ్ ఆసుపత్రులను సీజ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు.

గణేశ్ ఉత్సవాల్లో కరోనా పెరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కానీ రంజాన్ సమయంలో కరోనా కేసులు తగ్గించి చూపించారని బండి సంజయ్ ఆరోపించారు. అటు, భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకానికి బీజేపీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.
Bandi Sanjay
KCR
TRS
Telangana
Corona Virus

More Telugu News