kondapochamma: కొండపోచమ్మ జలాశయం వద్ద కొనసాగుతున్న వంతెన పునరుద్దరణ పనులు

  • ఈ ఏడాది మే 29న వంతెనను ప్రారంభించిన కేసీఆర్
  • కాంట్రాక్టర్‌ను పిలిపించి పునరుద్ధరణ పనులు చేపట్టిన అధికారులు
  • పర్యాటకుల రాకను నిలిపివేసిన వైనం
Kondapochamma sagar reservoir bridge collapsed

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కొండపోచమ్మ జలాశయం తూము వద్ద నిన్న కూలిపోయిన వంతెన పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. వంతెన కూలిన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వంతెన నిర్మించిన కాంట్రాక్టర్‌ను పిలిపించి వంతెన, కాలువ పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాగా, ఈ జలశయాన్ని చూసేందుకు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దీంతో జలాశయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. కాగా,  ఈ ఏడాది మే 29న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని ప్రారంభించారు. మూడు నెలలు కూడా పూర్తికాకుండానే వంతెన కూలిపోవడం గమనార్హం. జలాశయం కుడికాలువ ద్వారా సంగారెడ్డికి నీటిని విడుదల చేసే తూము గేట్ల వద్దకు వెళ్లేందుకు వీలుగా జలాశయం కట్టపై నుంచి ఈ వంతెన నిర్మించారు.

More Telugu News