Dawood Ibrahim: హీరోయిన్ తో నా అఫైర్ బయటకు ఎలా?... తేల్చాలని ప్రత్యేక టీమ్ ను పెట్టిన దావూద్ ఇబ్రహీం!

Dawood Appoints Special Team to Fidn How Affair with Heroin Mehawish Comes Out
  • మెహవిష్ తో దావూద్ కు సాన్నిహిత్యం
  • అఫైర్ పై వార్తలతో అసంతృప్తి
  • ఎలా తెలిసిందో విచారించాలని టీమ్ ఏర్పాటు
పాకిస్థాన్ సినీ నటి మెహవిష్ హయత్ తో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వార్తలు రావడం, ఈ వార్తలను ఇండియాలో ప్రముఖంగా ప్రచురించడంతో దావూద్ కలత చెందాడని తెలుస్తోంది. తన అఫైర్ బహిర్గతం కావడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని, ఆమెతో తనకున్న సంబంధంపై వివరాలు బయటకు ఎలా వెళ్లాయన్నది విచారించాలని, తన పర్సనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఆదేశించినట్టు తెలుస్తోంది. దావూద్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఓ టీమ్, ఇందుకు కారకులను అన్వేషిస్తున్నట్టు సమాచారం. 

1983, జనవరి 6న జన్మించిన మెహవిష్ హయత్, లోడ్ వెడ్డింగ్, పంజాబ్ నహీ జానుగీ, యాక్టర్ ఇన్ లా తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న మెహవిష్, గత కొన్నేళ్ల వరకూ ఎవరికీ తెలియదు. దావూద్ పరిచయం, ఆయన సిఫార్సుతో పాక్ సినీ పరిశ్రమలో అత్యుత్తమ అవార్డును పొందిన తరువాత, మెహవిష్ పేరు ఆ దేశంలో మారుమోగిపోయింది. అవార్డు పొందిన నెలల వ్యవధిలోనే పాక్ గ్లామర్ ప్రపంచంలో మెహవిష్ ప్రముఖురాలైందన్న సంగతి తెలిసిందే.
Dawood Ibrahim
Affair
Mahawish Hayat
Special Team

More Telugu News