ecuador: ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించి ఉన్న జంట ఇదే.. ఈక్వెడార్ కపుల్ గిన్నిస్ రికార్డు

Ecuadorian couple named worlds oldest married pair
  • 1934లో ఒకరికొకరు పరిచయం
  • 1941లో రహస్య వివాహం చేసుకున్న జంట
  • వీరిద్దరి మొత్తం వయసు 214 సంవత్సరాలు
ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించి ఉన్న జంటగా ఈక్వెడార్ రాజధాని క్విటోకు చెందిన వృద్ధ దంపతులు జూలియో సెసార్ మోరా టాపియా, వాల్డ్రామినా మక్లోవియాలు క్వింటెరాస్ రేయెస్‌లు గిన్నిస్ రికార్డులకెక్కారు.

రిటైర్డ్ టీచర్లు అయిన వీరి మొత్తం వయసు 214 ఏళ్లు. జూలియో వయసు 110 సంవత్సరాలు కాగా, వాల్డ్రామినా వయసు 104 ఏళ్లు. 79 సంవత్సరాల క్రితం 1941లో వీరు వివాహం చేసుకున్నారు. 1934లో వీరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోవడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం కాగా, 11 మంది మనవళ్లు, 21 మంది మునిమనవళ్లు, ఒక మునిముని మనవడు ఉన్నారు.
ecuador
couple
world’s oldest married pair
Guinness World Records

More Telugu News