Sushant Singh Rajput: సుశాంత్ థాయ్ లాండ్ ట్రిప్ పై ఆసక్తికర వివరాలు వెల్లడించిన మాజీ సహాయకుడు

Sushanth former assistant reveals what they did in Thailand
  • సుశాంత్ థాయ్ లాండ్ ట్రిప్ కు రూ.70 లక్షలు ఖర్చయిందన్న రియా
  • ప్రైవేటు జెట్ లో థాయ్ వెళ్లామన్న మాజీ సహాయకుడు
  • సుశాంత్ ఏటీఎం కార్డు తమకు ఇచ్చేశాడని వెల్లడి
ముంబయిలోని తన నివాసంలో జూన్ 14న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విగతజీవుడై కనిపించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సుశాంత్ కు సంబంధించిన ఏ అంశమైనా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చేసిన ఆరోపణలు కూడా అలాంటివే. సుశాంత్ రూ.70 లక్షలు ఖర్చు చేసి థాయ్ లాండ్ టూర్ వెళ్లాడని తెలిపింది. దీనిపై సుశాంత్ మాజీ సహాయకుడు సాబిర్ అహ్మద్ వివరణ ఇచ్చాడు.

కేదార్ నాథ్ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో సుశాంత్, హీరోయిన్ సారా అలీఖాన్ , సిద్ధార్థ్ గుప్తా, సుశాంత్ బాడీగార్డు ముస్తాక్, కౌశల్ జావేరి, తాను థాయ్ లాండ్ వెళ్లినట్టు సాబిర్ తెలిపాడు. థాయ్ లాండ్ కు తాము ఓ ప్రైవేటు జెట్ లో వెళ్లామని, ఆ ట్రిప్ కు అయిన ఖర్చు సుశాంతే భరించాడని వివరించాడు. టూర్ మొదటిరోజు మాత్రం బీచ్ లో ఎంజాయ్ చేశామని, ఆ తర్వాత రోజు నుంచి సుశాంత్, సారా లగ్జరీ హోటల్లోనే ఉండిపోయారని వెల్లడించాడు. తాము మాత్రం అక్కడి దర్శనీయ స్థలాలన్నీ తిరిగామని సాబిర్ చెప్పాడు.

ఆ తర్వాత మిగతా వాళ్లందరూ ఇండియా తిరిగొచ్చినా, తాను, ముస్తాక్ థాయ్ లాండ్ లోనే నెలరోజులు గడిపామని తెలిపాడు. అప్పుడు తమకు ఖర్చుల కోసం సుశాంత్ తన ఏటీఎం కార్డు ఇచ్చేశాడని, అందువల్లే అంత ఖర్చయిందని సాబిర్ స్పష్టం చేశాడు.

కాగా, నటి రియా చక్రవర్తి వరుసగా రెండోరోజు కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం పదిన్నర గంటలకు సీబీఐ ముందు హాజరవ్వాల్సి ఉండగా, ఇంటిముందు మీడియా హంగామా చూసి ఆమె భయపడింది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆమెను సీబీఐ అధికారులు ఉన్న డీఆర్డీఓ అతిథి గృహానికి తీసుకువచ్చారు.
Sushant Singh Rajput
Thailand
Sabir Ahmed
Sara Alikhan
Rhea Chakraborty

More Telugu News