Devineni Uma: కోర్టు చెప్పినా నిర్మాణపు పనులు ఆగడం లేదు: దేవినేని ఉమ

Govt is constructing state guest house despite of court orders says Devinene Uma
  • ఆ నిర్మాణం స్టేట్ గెస్ట్ హౌస్ కోసమేనా?
  • లేక సచివాలయ భవన నిర్మాణమా?
  • కొండపై యంత్రాలు, మనుషుల హడావుడి ఎక్కువగా ఉంది
వైసీపీ ప్రభుత్వం న్యాయస్థానాల తీర్పులను కూడా గౌరవించడం లేదని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. విశాఖలో సువిశాలమైన ప్రాంతంలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని అన్నారు. కొండపై యంత్రాలు, మనుషుల హడావుడి ఎక్కువగా ఉందని చెప్పారు. కొండపై జరుగుతున్న ఆ నిర్మాణం గెస్ట్ హౌస్ కోసమా? లేక సచివాలయ భవనం కోసమా? చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలను అడ్డుకోవాల్సిన వీఎంఆర్డీయే ద్వారానే నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని అన్నారు. తాజాగా బిడ్ల ప్రకటన కూడా చేశారని తెలిపారు.
Devineni Uma
Telugudesam
Vizag
State Guest House
YSRCP

More Telugu News