Allu Sirish: నేను తెలుగు నేర్చుకోవడానికి ఆయనే కారణం: అల్లు శిరీశ్

  • చెన్నై స్కూల్లో మాకు తమిళం, హిందీ నేర్పేవారు
  • తాత మాకు తెలుగు ట్యూషన్లు పెట్టించేవారు
  • ఆ తర్వాత తెలుగు నేర్పే పనిని అమ్మ తీసుకుంది
My grand father was the main person for us to learn telugu says Allu Sirish

మన యంగ్ హీరోల్లో చాలా మందికి తెలుగు రాయడం, చదవడం రాదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. దీనికి కారణం వారు చెన్నైలో పుట్టి, అక్కడే  చదువుకోవడమే. దీనికి సంబంధించి అల్లు శిరీశ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తాను తెలుగు నేర్చుకోవడానికి తన తాత అల్లు రామలింగయ్యే కారణమని చెప్పాడు.

ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శిరీశ్ స్పందిస్తూ, చెన్నై స్కూల్లో తమకు తమిళం, హిందీ మాత్రమే  నేర్పేవారని... కానీ, మాతృ భాష రావాలని తాత కోరుకునేవారని తెలిపాడు. ఆయనే తమకు ప్రత్యేకంగా తెలుగు ట్యూషన్లను పెట్టించేవారని చెప్పాడు. ఆయన తర్వాత తమకు తెలుగు నేర్పే పనిని అమ్మ తీసుకుందని తెలిపాడు. మన భాష, సంస్కృతిని నేర్పిన వారిద్దరికీ ధన్యవాదాలని అన్నాడు. తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశాడు.

More Telugu News