fraud: అన్న స్థానంలో ఉద్యోగం చేస్తోన్న తమ్ముడు.. ఒకేలా ఉండడంతో 12 ఏళ్లుగా గుర్తు పట్టని వైనం

  • పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన
  • జూనియర్‌ లైన్‌మన్‌గా అన్నకు ఉద్యోగం
  • అతడి పేరుతో చేరిన తమ్ముడు
  • 12 ఏళ్ల తర్వాత గుర్తించిన అధికారులు
twins cheats in godavarikhani

వారిద్దరు కవలలు.. అచ్చం ఒకేలా ఉంటారు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏకంగా 12 ఏళ్లుగా అన్న ఉద్యోగాన్ని తమ్ముడు చేస్తున్నాడు. చివరకు ఈ విషయాన్ని గుర్తించిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలోని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రాందాస్‌, గాదె రవీందర్‌ సోదరులు. అప్పట్లో గాదె రాందాస్‌ కు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ లైన్‌మన్‌గా ఉద్యోగం రాగా, అతడి పేరుతో తమ్ముడు గాదె రవీందర్‌ ఉద్యోగంలో చేరాడు.

అనంతరం క్రమంగా లైన్‌మన్‌గా పదోన్నతి పొందాడు. వారి బాగోతాన్ని గుర్తించిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. రాందాస్‌ పేరుతో రవీందర్‌ ఉద్యోగం చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రవీందర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News