R.krishnaiah: ఆన్‌లైన్ విద్యాబోధన మంచిదే కానీ.. వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య డిమాండ్

  • ఆన్‌లైన్ విద్యాబోధనను స్వాగతించిన కృష్ణయ్య
  • గ్రామీణ, మురికివాడల్లోని పిల్లలకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు లేవు
  • ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలి
R Krishnaiah Demands to give free laptops and Smartphones to poor students

ప్రస్తుత కరోనా కాలంలో ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచిదేనని అయితే, లక్షలాదిమంది పేద విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు వినే సౌలభ్యం లేదని, కాబట్టి వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు అందించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలో ఆన్‌లైన్ విద్యాబోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనిలా స్పందించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన కృష్ణయ్య, మారుమూల, గిరిజన, పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాదిమందికి ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో లేవని, దీంతో వారు ఆన్‌లైన్ పాఠాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. పేద విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా ఉండాలంటే వారికి వెంటనే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయాలని కృష్ణయ్య కోరారు.

More Telugu News