Devineni Uma: నా ఆఫీసుకు వచ్చి వెయిట్ చేసి, కలిసి వెళ్లేవాడు: కొడాలి నానిపై దేవినేని ఉమ వ్యాఖ్యలు

Devineni Uma reacts to harsh comments of Minister Kodali Nani
  • అప్పట్లో చాలా వినయంగా, అభిమానంగా ఉండేవాడు
  • ఇప్పుడు అధికారం తలకెక్కింది
  • నాని మాట్లాడుతున్న మాటలన్నీ జగన్ అంతరంగమే
ఏపీ మంత్రి కొడాలి నాని గురించి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. టికెట్ కోసం ప్రయత్నించే తొలి రోజుల్లో కంచికచర్లలోని తన ఆఫీసుకు కొడాలి నాని వచ్చేవాడని, విజిటర్స్ అందరూ వెళ్లిపోయేంత వరకు వెయిట్ చేసి, తనను కలిసి మాట్లాడి హైదరాబాదుకు వెళ్లేవాడని తెలిపారు. అంత వినయంగా, అభిమానంగా ఉన్న వ్యక్తికి... ఇప్పుడు అధికారం తలకెక్కిందని విమర్శించారు.

ఇప్పుడు కొడాలి నాని మాట్లాడే బూతులేంటి, బాధ్యతారాహిత్యమైన మాటలేంటని ఉమ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును విమర్శిస్తే కొన్ని శక్తులు డబ్బులిస్తాయని... ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ జగన్ అంతరంగమేనని చెప్పారు. టీడీపీ నుంచి ఎందుకెళ్లిపోయాడో నానికే తెలవాలని అన్నారు. అందరి కష్టసుఖాలను చంద్రబాబు వింటారని... తమ పార్టీ గొప్పదనం అదేనని చెప్పారు. ఇసుక దోపిడీని ఇద్దరు మంత్రులు పంచుకుంటున్నారని... ఈ విషయాన్ని డెల్టా ప్రాంతంలోని ఏ ఊరికి వెళ్లి అడిగినా చెపుతారని అన్నారు.
Devineni Uma
Telugudesam
Kodali Nani
YSRCP
Chandrababu
Jagan

More Telugu News