Vitamin D: విటమిన్ డి ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారా..?.. అయితే, ఇది చదవండి!

Intake of more vitamin d causes high toxicity in body
  • సూర్యకాంతి ద్వారా లభ్యమయ్యే విటమిన్ డి
  • మాత్రల మోతాదు మించితే ప్రమాదమంటున్న నిపుణులు
  • శరీరంలో విషపదార్థాల శాతం పెరుగుతుందని వెల్లడి

మనిషి ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో ముఖ్యమని డాక్టర్ల నుంచి అనేక వైద్య అధ్యయనాల వరకు అందరూ చెప్పే మాట! సహజంగా సూర్యకాంతి ద్వారా లభ్యమయ్యే విటమిన్ డి మాత్రల రూపంలోనూ దొరుకుతుంది. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ వైరస్ మహమ్మారిని దూరంగా ఉంచేందుకు విటమిన్ డి కూడా తోడ్పడుతుందన్న అధ్యయనాల నేపథ్యంలో విటమిన్ డి వాడకం ఎక్కువైంది.

అయితే విటమిన్ డి సప్లిమెంట్ల రూపంలో తీసుకునేటప్పుడు వైద్యుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలని, స్వీయ వైద్యం పనికిరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విటమిన్ డి మాత్రలు అధికంగా తీసుకుంటే శరీరంలో విష పదార్థాల శాతం పెరుగుతుందని, దేహంలో కాల్షియం స్థాయి కూడా ఎక్కువ అవుతుందని, ఈ నేపథ్యంలో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందని ముంబయి కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

విటమిన్ డి మాత్రల వాడకం వైద్యుల పర్యవేక్షణలో సాగాలని, డాక్టర్ సూచించిన మోతాదు మేరకే వాడాలని డాక్టర్ గిరీష్ పర్మార్ తెలిపారు. అయితే, విటమిన్ డి వాడకాన్ని ప్రారంభించే ముందు శరీరంలో విటమిన్ డి ఎంత స్థాయిలో ఉందన్నది తెలుసుకోవడం ఎంతో అవసరం అని నిపుణులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News