Sonia Gandhi: విద్యార్థులు ఏం చెబుతున్నారో వినండి... నీట్, జేఈఈపై కేంద్రానికి హితవు పలికిన సోనియా

  • నీట్, జేఈఈ నిర్వహణకు కేంద్రం నిర్ణయం
  • వద్దంటున్న ప్రతిపక్షాలు
  • విద్యార్థులే దేశ భవిష్యత్ అంటూ సోనియా వీడియో సందేశం
 Sonia Gandhi says Centre must listen students concerns on NEET and JEE

కరోనా భూతం విలయం సృష్టిస్తున్నప్పటికీ, వైద్య, ఇంజినీరింగ్ జాతీయస్థాయి ప్రవేశాల కోసం నీట్, జేఈఈ నిర్వహించాలని కేంద్రం సంసిద్ధమవుతోంది. అయితే, ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ వీడియో సందేశం వెలువరించారు. నీట్, జేఈఈ నిర్వహణపై విద్యార్థులు ఏం చెబుతున్నారో వినాలని కేంద్రానికి హితవు పలికారు. విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

"విద్యార్థులే మన భవిష్యత్తు. మెరుగైన భారతదేశాన్ని నిర్మించేందుకు మనం వారిపైనే ఆధారపడ్డాం. అలాంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి సమ్మతి కూడా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ ప్రభుత్వం విద్యార్థుల స్పందనను వింటుందని భావిస్తున్నాను. విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ఇదే కేంద్ర ప్రభుత్వానికి నేనిచ్చే సలహా" అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.


More Telugu News