Sunny Leone: కాలేజ్ మెరిట్ లిస్ట్‌లో సన్నీలియోన్ పేరు.. షాకవుతున్న జనాలు!

Sunny Leone name in college merit list
  • కోల్ కతా కాలేజ్ మెరిట్ లిస్టులో టాపర్ గా సన్నీ
  • నాలుగు సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు
  • వచ్చే సెమిస్టర్ లో అందరినీ కలుస్తానంటూ సన్నీ వ్యాఖ్య
ఓటరు కార్డులు, ఆధార్ కార్డుల్లో పేరు ఎవరిదో ఉండి, సెలబ్రిటీల ఫొటోలు రావడం చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి కోల్ కతాలో జరిగింది. స్థానిక అశుతోష్ కాలేజీలో బి.ఎ. ఇంగ్లిష్ (ఆనర్స్)లో ప్రవేశానికి సంబంధించి ప్రకటించిన మెరిట్ లిస్టులో ఏకంగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు వచ్చింది. అంతేకాదు, టాపర్ కూడా ఆమే. నాలుగు సబ్జెక్టుల్లో ఆమెకు నూటికి నూరు మార్కులు వచ్చాయి. దీన్ని చూసిన వారంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

చివరకు ఈ వార్త కాస్తా సన్నీలియోన్ వరకు వెళ్లింది. దీనిపై ఆమె స్పందిస్తూ, 'నెక్స్ట్ సెమిస్టర్ లో మీ అందరినీ కలుస్తా. నా క్లాసులో మీరంతా ఉంటారని భావిస్తున్నా' అని సరదాగా వ్యాఖ్యానించింది. దీనిపై కాలేజీ యాజమాన్యం కూడా స్పందించింది. ఇది ఎవరో కావాలనే చేశారని... దీనిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Sunny Leone
College
Merit List
Bollywood

More Telugu News