Vijayasai Reddy: రఘురామకృష్ణరాజును లోక్ సభ స్పీకర్ డిస్ క్వాలిఫై చేయాలి: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy urges Lok Sabha speaker to disqualify Raghu Ramakrishna Raju
  • రాజధానిగా వైజాగ్ ను ఏ శక్తీ ఆపలేదు
  • మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉంది
  • చంద్రబాబు కులతత్వవాది
ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ను ఏ శక్తీ ఆపలేదని వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. టీడీపీ నేత పంకచర్ల రమేశ్ బాబు వైసీపీలో చేరిన సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రమేశ్ బాబును పార్టీలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు.

చంద్రబాబు కులతత్వవాది అని విజయసాయి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ కులాలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమాన ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణరాజు సభ్యత్వాన్ని లోక్ సభ స్పీకర్ రద్దు చేయాలని కోరారు. స్టాండింగ్ కమిటీ నుంచి తొలగించాలని కూడా విన్నవించారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Jagan
Raghu Ramakrishna Raju

More Telugu News