Gunnis Book: నీటిలో ఊపిరి బిగపట్టి, 2.17 సెకన్లలో ఆరు రూబిక్స్ క్యూబ్ ల సాల్వ్... భారత యువకుడి గిన్నిస్ రికార్డు వీడియో!

  • చెన్నైకి చెందిన యువకుడి రికార్డు
  • ఊపిరి పీల్చకుండా చేయడం ఇదే తొలిసారి
  • వీడియోను విడుదల చేసిన గిన్నిస్ బుక్
Chennai Youth Solved 6 Rubiks in Underwater Video

ఒక రూబిక్స్ క్యూబ్ ను సాల్వ్ చేసేందుకు గంటల తరబడి, రోజుల తరబడి కుస్తీలు పడుతూ ఉండేవారు ఎందరో ఉంటారు. అటువంటి రూబిక్స్ ను ఎలా తిరిగి సరిగ్గా అమర్చాలన్న విషయమై ఎంతో ప్రాక్టీస్ చేస్తే, కొన్ని నిమిషాల్లోనే చేసే సత్తా వస్తుంది. అటువంటిది చెన్నైకి చెందిన 25 ఏళ్ల యువకుడు, నీటిలో మునిగి ఊపిరి బిగపట్టి ఒకటి, రెండు కాదు... ఏకంగా ఆరు రూబిక్స్ క్యూబ్ లను తిరిగి సక్రమంగా అమర్చాడు. అది కూడా కేవలం 2.17 సెకన్ల వ్యవధిలోనే. ఇది సరికొత్త గిన్నిస్ రికార్డని గుర్తిస్తూ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ఈ వీడియోను షేర్ చేశారు.

ఇందులో ఇలయారమ్ శేఖర్ అనే యువకుడు ఈ ఘనతను సాధించాడు. ఈ రికార్డును అధికారికంగా గుర్తిస్తున్నామని, ప్రపంచంలో అతి తక్కువ సమయంలో ఆరు క్యూబ్ లను ఊపిరి పీల్చకుండా నీటిలో సాల్వ్ చేయడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. తాను 2013 నుంచి క్యూబ్ లను సాల్వ్ చేస్తున్నానని, రెగ్యులర్ గా యోగాను చేయడం ద్వారా శ్వాసను అదుపులో ఉంచుకునే సమయాన్ని పెంచుకోగలిగానని ఈ సందర్భంగా శేఖర్ వ్యాఖ్యానించారు.

కాగా, గత సంవత్సరం అరుణాచల్ ప్రదేశ్ లోని లాంగ్ కాయ్ గ్రామానికి చెందిన ఓ బాలుడు, కళ్లు మూసుకుని, 40 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ ను సాల్వ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతకు కొన్ని నెలల ముందు ముంబైకి చెందిన 20 ఏళ్ల చిన్మయ్ ప్రభు, 9 పారామినిక్స్ ను నీటిలో కూర్చుని సాల్వ్ చేశాడు. పారామినిక్స్ అంటే, పిరమిడ్ ఆకృతిలో ఉండే రూబిక్స్ క్యూబ్.



More Telugu News