Sushant Singh Rajput: సుశాంత్ మృతి కేసు... సీబీఐ ఆఫీసుకి వచ్చిన రియా.. ప్రశ్నిస్తోన్న అధికారులు

rhea reaches mumbai office for cbi probe in sushant case
  • రియా చ‌క్ర‌వ‌ర్తికి సీబీఐ స‌మ‌న్లు 
  • డీఆర్‌డీవో అతిథిగృహానికి వచ్చిన రియా
  • విచారణ జరుపుతోన్న సీబీఐ
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆయన ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తికి స‌మ‌న్లు జారీ చేయడంతో ఆమె ఈ రోజు ఉదయం ముంబైలోని డీఆర్‌డీవో అతిథిగృహానికి వచ్చింది. అక్కడే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమెతో పాటు సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానిని కూడా సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నాను.

నిన్న రియా సోదరుడితో పాటు, సుశాంత్ సింగ్‌ కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారించారు. కాగా, రియా తన కుమారుడిని మానసికంగా వేధించి, డబ్బులు తీసుకుందని సుశాంత్ తండ్రి ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ ఇంట్లో పనిచేసే వారిని సీబీఐ అధికారులు ప్రశ్నించగా పలు విషయాలు బయటపడ్డాయి.
Sushant Singh Rajput
Bollywood
CBI

More Telugu News