Hyderabad: అపార్ట్‌మెంట్‌ టెర్రస్ పై పార్టీ.. విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపిన మాజీ జవాన్

Army ex Jawan fired on people who are in liquor party
  • హైదరాబాద్ శివారు హైదర్షాకోట్‌లో ఘటన
  • పార్టీ చేసుకోవద్దంటూ గొడవ
  • వ్యక్తి పక్క నుంచి దూసుకెళ్లిన తూటా
ఓ అపార్ట్‌మెంట్‌పై పార్టీ చేసుకుంటున్న కొందరిపై ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ జవాను గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన హైదరాబాద్ శివారు నార్సింగిలోని హైదర్షాకోట్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైరీచ్ ఇంటర్నెట్‌కు చెందిన కొందరు సిబ్బంది గత రాత్రి అపార్ట్‌మెంట్‌పై పార్టీ చేసుకుంటున్నారు.

అది గమనించిన ఆర్మీ మాజీ జవాను నాగమల్లేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. పార్టీని ఆపేసి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయి ఊగిపోయిన నాగమల్లేశ్వరరావు ఇంట్లోకి వెళ్లి తుపాకి తీసుకొచ్చి ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. అయితే, బుల్లెట్ అతడి చేయి పక్క నుంచి దూసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నాగమల్లేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad
Liquor party
Hireach broadbond
Army Jawan
firing

More Telugu News