Corona Virus: అండమాన్ లో కరోనా కల్లోలం...తీవ్ర ముప్పు ముంగిట ఆదిమజాతులు!

  • అండమాన్ లో ఆలస్యంగా ప్రవేశించిన కరోనా
  • ఇప్పటివరకు 2,985 పాజిటివ్ కేసులు
  • 41 మంది మృతి
  • గ్రేటర్ అండమానీస్ తెగలో నలుగురికి కరోనా పాజిటివ్
Corona virus pandemic rattles Andaman islands

అండమాన్ నికోబార్ దీవుల్లో కాస్త ఆలస్యంగా ప్రవేశించిన కరోనా భూతం గణనీయమైన స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు అక్కడ 2,985 పాజిటివ్ కేసులు రాగా, 41 మంది మరణించారు. అండమాన్ దీవుల్లో జరావా, సెంటినలీస్, గ్రేటర్ అండమానీస్, షోంఫెన్, ఓంగే వంటి ఐదు ఆదిమ తెగలు ఉన్నాయి. నార్త్ సెంటినలీస్ ఐలాండ్ లో జీవించే అతిపురాతన ఆదిమవాసులైన సెంటినలీస్, మరో దీవిలో నివసించే జరావాలకు సాధారణ జనజీవితంతో సంబంధాలు లేవు. మిగతా తెగలు మాత్రం బాహ్య ప్రపంచంతో సంబంధాలు కొనసాగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, ఇప్పటికే అంతరించే ప్రమాదంలో ఉన్న పలు ఆదిమజాతుల ప్రజలకు కరోనా మహమ్మారి పెనుముప్పు అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ అండమానీస్ తెగ జనాభా 53 మంది కాగా, ఇప్పుడు వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. మిగతా ప్రపంచంతో తక్కువస్థాయిలో సంబంధాలు నెరపే ఈ ఆదిమజాతుల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ. సాధారణ జలుబు, జ్వరం సైతం సెంటినలీస్ వంటి తెగలను సమూలంగా తుడిచిపెట్టేస్తాయని ఆరోగ్య నిపుణులంటున్నారు.

More Telugu News