Chandrababu: ఒక మేజర్ పోర్టు, 11 మైనర్ పోర్టులున్న ఏపీ ఇలా దిగజారిపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: చంద్రబాబు

  • నీతి అయోగ్ జాబితాలో ఏపీకి 20వ స్థానం
  • తీర ప్రాంత రాష్ట్రాల జాబితాలో 7వ స్థానం
  • తీరప్రాంతాన్ని ఉపయోగించుకోలేకపోయారన్న చంద్రబాబు
Chandrababu slams AP Government on the sidelines of NITI AAYOG indexes

నీతి అయోగ్ తాజాగా విడుదల చేసిన జాతీయ ఎగుమతుల సన్నద్ధత సూచీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో ఏపీ 20వ స్థానంలో ఉండడం విచారకరం అని పేర్కొన్నారు. అటు, తీర ప్రాంత రాష్ట్రాల జాబితాలో 7వ స్థానంలో నిలిచిందని తెలిపారు.

అతిపొడవైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రం కనీసం 8 తీర ప్రాంత రాష్ట్రాలతో పోటీపడలేక 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పోర్టులు లేకున్నా తెలంగాణ 6వ స్థానంలో ఉంటే, ఒక మేజర్ పోర్టు, 11 మైనర్ పోర్టులు ఉన్న ఏపీ ఇలా దిగజారిపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని అభిప్రాయపడ్డారు. తీర ప్రాంత రాష్ట్రమైనా పాలసీపరంగా ఏపీ పనితీరు నాసిరకంగా ఉందని నీతి అయోగ్ వ్యాఖ్యానించడం కన్నా అవమానం ఏముందని ట్వీట్ చేశారు.

More Telugu News