Dhan Raj: 'దీపావళి' పండుగ గురించి తప్పుగా మాట్లాడాను.. క్షమించండి: హాస్య నటుడు ధన్ రాజ్

Please forgive me says actor Dhan Raj
  • ఓ స్కిట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ధన్ రాజ్
  • కామెడీ కోసమే అలా చేశానని వివరణ
  • ఇకపై అలా చేయనని వ్యాఖ్య

కమెడియన్ ధన్ రాజ్ తెలుగు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే, తెలుగు టీవీ షోలో పాల్గొంటున్న ధన్ రాజ్... ఓ స్కిట్ సందర్భంగా దీపావళి పండుగ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీప అనే అమ్మాయి, వలీ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం దీపావళి అనే పేరు వచ్చిందని వ్యాఖ్యానించాడు. దీనిపై ప్రేక్షకులతో పాటు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే క్షమాపణ చెప్పకపోతే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో ధన్ రాజ్ క్షమాపణలు చెప్పాడు. కామెడీ కోసమే అలా చేశామని... ఇంత సీరియస్ అవుతుందని తాను భావించలేదని అన్నాడు. పండుగను కించపరిచే ఆలోచన తనకు లేదని చెప్పాడు. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపాడు. అందరూ తనను క్షమించాలని కోరాడు.

  • Loading...

More Telugu News