Rajannadora: సోనూ సూద్ కు వైసీపీ ఎమ్మెల్యే లేఖ... చరిత్ర సృష్టించారంటూ గిరిజనులను కొనియాడిన నటుడు!

YCP MLA Rajannadora writes Sonu Sood in the wake of Chintamala tribes built a road
  • సొంతంగా రోడ్డు నిర్మించుకున్న చింతామల గిరిజనులు
  • గిరిజనులను సోనూ అభినందించిన తీరు అమోఘమన్న ఎమ్మెల్యే
  • అందరం కలిసి ప్లాన్ చేద్దామన్న సోనూ సూద్
విజయనగరం జిల్లాలోని చింతామల గ్రామ గిరిజనులు సొంతంగా రహదారి నిర్మించుకోవడం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన దాతృత్వ సేవలతో విశేష పేరు ప్రఖ్యాతులు పొందుతున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా చింతామల గిరిజనుల పట్టుదల, స్వయంకృషి పట్ల ముగ్ధులయ్యారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర నటుడు సోనూ సూద్ కు లేఖ రాశారు.

చింతామల గిరిజనులు ప్రభుత్వ సహకారం లేకుండా రోడ్డు వేసుకోవడం పట్ల మీరు స్పందించిన తీరు అమోఘం అంటూ పేర్కొన్నారు. చింతామల గిరిజనులు దేశానికే స్ఫూర్తిగా నిలిచారంటూ మీరు ట్విట్టర్ లో పేర్కొన్న పలుకులు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. త్వరలోనే మీరు చింతామల రావాలనుకుంటున్నట్టు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం అంటూ రాజన్నదొర తన లేఖలో తెలిపారు.

దీనిపై సోనూ సూద్ స్పందించారు. త్వరలోనే చింతామల తప్పకుండా వస్తానని, అందరం కలిసి ప్రణాళిక రూపొందిద్దామని తెలిపారు. మీరు చరిత్ర సృష్టించారు అంటూ చింతామల గిరిజనులను మరోసారి కొనియాడారు.
Rajannadora
Sonu Sood
Letter
Tribes
Road
Chintamala

More Telugu News