Nara Lokesh: రైతుల స‌మ‌స్య కేసు రోజుల్లో తేలిపోవాలా? మీ లక్ష కోట్ల దోపిడీ కేసు ఏళ్ల తరబడి సాగాలా?: సీఎం జగన్ పై లోకేశ్ ధ్వజం

TDP MLC Nara Lokesh slams YS Jagan on court cases issue
  • 11 కేసుల విచారణలో సీఎం జగన్ సహకరించాలన్న లోకేశ్
  • విచారణ ఆలస్యానికి అనేక యత్నాలు చేస్తున్నారని వెల్లడి
  • రకరకాల పిటిషన్లతో పదేళ్లు గడిపేశారని విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. అమరావతిని చంపేందుకు త్వరగా కోర్టులో విచారణ పూర్తిచేయాలని అడుగుతున్న సీఎం జగన్... లక్ష కోట్ల ప్రజాధనం దోచేసిన వ్యవహారంలో 11 కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని హితవు పలికారు. సీఎం జగన్ కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు, విచారణ ఆలస్యం అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

కరోనా వైరస్ భయం వల్ల ఒకసారి, కోర్టుకు రావాలంటే రూ.60 లక్షలు అవుతుందని మరోసారి, ప్రతిపక్ష నేతగా ఉన్నాను కోర్టుకు రాలేనని గతంలో ఓసారి... ఇలా రకరకాల కారణాలతో విచారణ రాకుండా గడిపేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్నాను కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారని మండిపడ్డారు. అనేక పిటిషన్లతో 10 ఏళ్లు గడిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

29 వేల మంది రైతుల కేసు కొన్నిరోజుల్లోనే  తేలిపోవాలా? మీ లక్ష కోట్ల దోపిడీ కేసేమో ఏళ్ల తరబడి సాగాలా? అంటూ లోకేశ్ సీఎం జగన్ ను ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News