Rhea Chakraborthy: రక్త పరీక్షకు కూడా రియా సిద్ధమేనన్న ఆమె తరపు లాయర్!

Rhea Chakraborthy is ready for blood test says his lawyer
  • డ్రగ్స్ డీలర్ తో రియా చాటింగ్
  • కేసు నమోదు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
  • రియాకు బిగుస్తున్న ఉచ్చు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి సుశాంత్ మాజీ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తిపై తొలి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సీబీఐ విచారణలో డ్రగ్స్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో, రియాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేసు నమోదు చేసింది. దీనిపై ఆమె తరపు లాయన్ స్పందించారు.

రియా ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె లాయర్ తెలిపారు. రక్త పరీక్షలు నిర్వహిస్తే విషయం తేలిపోతుందని...  బ్లడ్ టెస్ట్ కు రియా ఏ సమయంలోనైనా సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. మరోవైపు, సీబీఐ కూడా తన విచారణలో డ్రగ్స్ కోణాన్ని పరిగణనలోకి తీసుకోబోతోందని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ రియా చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఇంకోవైపు, సుశాంత్ తండ్రి తాజాగా స్పందిస్తూ... తన కుమారుడి మరణానికి రియానే కారణమని మరోసారి ఆరోపించారు.
Rhea Chakraborthy
Sushant Singh Rajput
Bollywood
Drugs
Blood Test

More Telugu News