suresh raina: తన కుమారుడి క్యూట్ వీడియో షేర్ చేసిన రైనా

suresh raina shares his sons video
  • కుమారుడిని చూస్తే గర్వంగా ఉందని వ్యాఖ్య
  • అతడితో ఉన్నంతసేపు తన కష్టాలన్నీ మరిచిపోతానని ట్వీట్
  • ప్రస్తుతం దుబాయ్‌లో రైనా
టీమిండియా మాజీ ఆటగాడు‌ సురేశ్‌ రైనా తన ట్విట్టర్‌ ఖాతాలో తన కుమారుడు రియో ఫోటోను పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను చూస్తే గర్వంగా ఉందని, తన కుమారుడు తన జీవితంలోకి రావడం తనను గర్వపడేలా చేసిందని చెప్పాడు. తన కుమారుడితో ఉన్నంతసేపు తన కష్టాలన్నీ మరిచిపోతానని చెప్పాడు. కాగా, 2015లో రైనాకు తన బాల్య స్నేహితురాలు ప్రియాంకతో పెళ్లి జరిగింది.

వీరి అన్యోన్య దాంపత్యానికి చిహ్నం ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు రైనా గుడ్‌ బై చెప్పేశాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆడడం కోసం సురేశ్‌ రైనా దుబాయ్‌కు చేరుకున్నాడు. తన జట్టు సభ్యులతో ప్రాక్జీస్ చేస్తున్నాడు.
suresh raina
Cricket
India
Viral Videos

More Telugu News