ఫేస్‌బుక్ పలకరింతకు పొంగిపోయి.. రూ. 1.30 లక్షలు సమర్పించుకున్న మహిళ
- కృష్ణా జిల్లా పెనమలూరులో ఘటన
- హాయ్ చెప్పిన పాపానికి నిండా మునిగిన బాధితురాలు
- డబ్బులు ఖాతాలో పడ్డాక స్విచ్చాఫ్
చెప్పినట్టే ఈ నెల 2న మళ్లీ ఆమెకు ఫోన్ చేసిన నిందితుడు తాను పంపిన కానుకల పార్శిల్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్ అధికారులు పట్టుకున్నారని, రూ. 1.30 లక్షలు చెల్లిస్తేనే వాటిని విడిచిపెడతారని చెప్పాడు. అతడు మాటలు నమ్మిన మహిళ అతడు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా రూ. 1.30 లక్షలు జమచేసింది. అంతే, ఆ తర్వాతి నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. మరోవైపు, కానుకల పార్శిల్ కూడా తనకు చేరకపోవడంతో అనుమానించిన ఆమె నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.