ఓజోన్ గ్యాస్‌తో కరోనాకు చెక్: జపాన్ శాస్త్రవేత్తల వెల్లడి
- తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువుతో కరోనా క్రియారహితం
- 0.55 నుంచి 0.1 పీపీఎం స్థాయిలో ఉపయోగిస్తే ఫలితాలు
- ఇప్పటికే ఓజోన్ జనరేటర్లను ఉపయోగిస్తున్న జపాన్
మూసివున్న గదిలో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో ఓజోన్ జనరేటర్‌ను ఉపయోగించి దాదాపు 10 గంటలపాటు తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును వాడారు. ఫలితంగా వైరస్ శక్తి 90 శాతం తగ్గినట్టు గుర్తించారు. ఓజోన్ ఒకరకమైన ఆక్సిజన్ అణువని, ఇది అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుందని చీఫ్ సైంటిస్ట్ మురాఠా పేర్కొన్నారు.
అధిక తేమతో కూడిన పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా పనిచేస్తుందన్నారు. 1-6 పీపీఎం మధ్య అధిక సాంద్రత కలగిన ఓజోన్ వాయువు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నా అది మానవులకు విషపూరితంగా మారే అవకాశం ఉందని గత ప్రయోగాలు వెల్లడించాయి. కాగా, జపాన్‌లోని ఐచి ప్రఫెక్చర్‌లోని ఫుజిటా మెడికల్ యూనివర్సిటీ ఓజోన్ జనరేటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసి వైరస్ సంక్రమణను తగ్గించేందుకు కృషి చేస్తోంది.