SPB: స్పృహలోకి వచ్చిన ఎస్పీబీ... త్వరలోనే ఎక్మో పరికరం తొలగింపు!

SPB Come Into Consious
  • కరోనా సోకి ఎంజీఎం ఆసుపత్రిలో చేరిక
  • శ్వాసక్రియ మెరుగు పడింది
  • వారంలో ఎక్మో తీసే అవకాశాలు ఉన్నాయన్న వైద్యులు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు శుభవార్త చెప్పారు. ఆయన స్పృహలోకి వచ్చారని, ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతూ ఉందని చల్లటి కబురు చెప్పారు. ప్రస్తుతం చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని తెలుపుతూ ఓ హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.

 బాలు శ్వాసక్రియ మెరుగుపడిందని వెల్లడించిన వైద్యులు, ఇదే విధంగా నిలకడైన పరిస్థితి ఉంటే, వారం రోజుల్లోనే ఆయనకు అమర్చిన ఎక్మో పరికరాన్ని తొలగిస్తామని అన్నారు. కాగా, కరోనా సోకిన పరిస్థితుల్లో ఎంజీఎం ఆసుపత్రిలో బాలు చేరగా, ఆపై ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఎంజీఎం హాస్పిటల్ ఐసీయూ కింది అంతస్తులో వేద పండితులు నిత్యమూ వేద పారాయణం చేస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని బాలూకు చికిత్స చేస్తున్న గదిలో ఉన్న టీవీలో లైవ్ వచ్చే ఏర్పాటు చేశారు.
SPB
Echmo
Chennai
MGM
Health

More Telugu News