Tamil Nadu: లారీలో రూ. 10 కోట్ల విలువైన రెడ్‌మి సెల్‌ఫోన్లు.. సినీ ఫక్కీలో దుండగుల హైజాక్!

  • చెన్నై నుంచి సెల్‌ఫోన్లతో ముంబైకి బయలుదేరిన కంటెయినర్
  • మరో లారీతో వెంబడించి డ్రైవర్‌ను కొట్టి లారీతో పరార్
  • సగం సరుకు తీసుకుని లారీని వదిలేసి వెళ్లిపోయిన దుండగులు
Robbers waylay lorry loot 5 crore worth mobile phones

తమిళనాడు నుంచి ముంబైకి దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన సెల్‌ఫోన్లతో బయలుదేరిన ఓ కంటెయినర్ లారీని దుండగులు సినీఫక్కీలో హైజాక్ చేసి అందులోని సరుకును కొల్లగొట్టారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన తమిళనాడులోని పొన్‌పాడి చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీపెరంబదూరు నుంచి ఎంఐ (రెడ్‌మి) కంపెనీకి చెందిన సెల్‌ఫోన్ల లోడుతో ఓ కంటెయినర్ లారీ మంగళవారం రాత్రి ముంబైకి బయలుదేరింది. మరో లారీలో ఆ లారీని వెంబడించిన దుండగులు పొన్‌పాడి చెక్‌పోస్టు వద్ద సరుకు ఉన్న లారీని అడ్డగించి డ్రైవర్‌ను కొట్టి కంటెయినర్‌ను తీసుకెళ్లారు.

నిర్మానుష్య ప్రదేశానికి లారీని తీసుకెళ్లి అందులో ఉన్న 16 బాక్సుల్లో 8 బాక్సులను (దాదాపు రూ. 5 కోట్ల విలువ) దోచుకుని లారీని అక్కడే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కంటెయినర్ లారీని నిన్న స్టేషన్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ముంబైకి చెందిన లారీ డ్రైవర్ ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News