Supreme Court: లాక్ డౌన్ మీరే చేశారు.. అప్పులు తీసుకున్న వాళ్లకు ఉపశమనం కలిగించాల్సింది కూడా మీరే: సుప్రీంకోర్టు

You Locked Down Whole Country Now Give Relief says Supreme Court To Centre
  • లోన్ల రీపేమెంట్ పై మారటోరియం విధించిన ఆర్బీఐ
  • వినియోగదారులపై వడ్డీ భారం మోపుతున్న బ్యాంకులు
  • మానవతాకోణంలో చూడాలన్న సుప్రీంకోర్టు
లాక్ డౌన్ నేపథ్యంలో లోన్లపై ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఈఎంఐలు చెల్లించాలంటూ రుణం తీసుకున్న వారిపై ఒత్తిడి చేయకూడదని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. అయితే, ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం ఉన్నప్పటికీ లోన్ తీసుకున్న వారిపై అప్పులు ఇచ్చిన సంస్థలు వడ్డీ భారాన్ని మోపుతున్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశాన్ని నేడు విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వమేనని... అందువల్ల మారటోరియం సమయంలో లోన్ రీపేమెంట్లకు సంబంధించి వడ్డీని చెల్లించకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమేనని వ్యాఖ్యానించింది. ఆర్బీఐదే బాధ్యత అని తప్పించుకోవడం కుదరదని తెలిపింది. సెప్టెంబర్ 1లోగా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద వడ్డీని ఎత్తేసే సదుపాయం కేంద్రానికి ఉంటుందని చెప్పింది. ఈ అంశాన్ని బిజినెస్ కోణంలో మాత్రమే చూడకూడదని... ప్రజల ఇబ్బందులకు సంబంధించి మానవతాకోణంలో చూడాలని సూచించింది.
Supreme Court
Banks
Loans
Maratorium

More Telugu News