Muharram: మొహర్రం ఊరేగింపుపై  తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

TS High Court denies permission for Muharram celebrations
  • ఊరేగింపుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్
  • ఇలాంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిందన్న హైకోర్టు
  • సుప్రీం తీర్పులు ధిక్కరించలేమని వ్యాఖ్య
మొహర్రం సందర్భంగా ముస్లింలు ఊరేగింపులు చేయడం ఆనవాయతీ. అయితే, కరోనా కారణంగా ఎవరూ ఏ కార్యక్రమం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 30న హైదరాబాదులోని పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపుకు అనుమతించేలా పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఊరేగింపుకు తాము అనుమతిని ఇవ్వలేమని చెప్పింది. మొహర్రం ఊరేగింపుకు సంబంధించి నిన్ననే సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ను నిరాకరించిందని... అందువల్ల హైకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను తాము ఎలా ధిక్కరించగలమని వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని చెప్పింది.
Muharram
Hyderabad
TS High Court

More Telugu News