Vijay Devarakonda: కొత్త సీన్లు జోడించి.. అర్జున్ రెడ్డిని మళ్లీ వదులుతారట!

Arjun Reddy movie will be released again with added scenes
  • బోల్డ్ సీన్లతో రూపొందిన 'అర్జున్ రెడ్డి'
  • చాలా సీన్లు తీసేశామన్న దర్శకుడు
  • 2022 ఆగస్టు 25న కొత్త సీన్లతో రిలీజ్ చేసే ప్లాన్
హీరో విజయ్ దేవరకొండ కెరీర్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమా 'అర్జున్ రెడ్డి'. లవ్ స్టోరీనే అయినప్పటికీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ కథను చెప్పిన విధానం కొత్తగా సాగడంతో యూత్ కి బాగా నచ్చేసింది. ఆ డైలాగులు .. ఆ సీన్లు అన్నీ బోల్డ్ గా వుంటాయి. ఇది తెలుగు సినిమాయేనా? అన్న డౌటు కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. హీరోకి, దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. అయితే, అసలు తీసిన సినిమా నిడివి చాలా పెద్దదట.

దీని గురించి తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, "మొదట్లో 4 గంటల 20     నిమిషాల నిడివితో చిత్రాన్ని తీశాం. అయితే, ఎడిటింగులో కొన్ని సీన్లు కట్ చేసి, చివరికి 3 గంటల 45 నిమిషాల రన్ టైంతో చిత్రాన్ని సిద్ధం చేశాం. కానీ, కొన్ని కారణాల వల్ల చిత్రాన్ని మళ్లీ ట్రిమ్ చేసి ఈసారి 3 గంటల 6 నిమిషాల నిడివితో చిత్రాన్ని రిలీజ్ చేశాం.

అయితే, 3.45 గంటల రన్ టైంతో కనుక చిత్రాన్ని రిలీజ్ చేసుంటే మరింత హిట్టయ్యేదని మేం అనుకుంటున్నాం. అందుకే, ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా అంటే 2022 ఆగస్టు 25న మొదట్లో మేం అనుకున్న విధంగా 3.45 గంటల రన్ టైంతో చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారు.

ఇక అప్పుడు రిలీజ్ అయ్యే 'అర్జున్ రెడ్డి' సరికొత్తగా ఉంటుందనీ, మరిన్ని కొత్త సీన్లు ఉంటాయని దర్శకుడు చెప్పారు. అర్జున్ రెడ్డి బాల్యం, అతని బుల్లెట్ బైకుకు సంబంధించిన సన్నివేశాలు, అర్జున్ రెడ్డి పెంచుకున్న కుక్కతో వుండే సన్నివేశాలు, అర్జున్ రెడ్డి స్కూల్ ఫ్రెండ్స్ కు సంబంధించిన సీన్లు ఉంటాయనీ, అలాగే బోలెడు ఫన్నీ సన్నివేశాలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు.  
Vijay Devarakonda
Sandip Reddy
Arjun Reddy

More Telugu News