Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy meets Venkaiah Naidu
  • ఉపరాష్ట్రపతి భవన్ లో భేటీ
  • స్టాండింగ్ కమిటీ రిపోర్టును అందించిన విజయసాయి
  • వ్యవసాయ, సముద్రపు ఉత్పత్తులపై రిపోర్ట్
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కలిశారు. ఉపరాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ఆయన... వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టును వెంకయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులు, సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులు, పంటలు, పసుపు, కొబ్బరి పీచు వంటి వాటికి సంబంధించిన రిపోర్టును గౌరవనీయులైన రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతికి అందించడం జరిగిందని ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నారు.
Venkaiah Naidu
Vijayasai Reddy
YSRCP

More Telugu News