Nandu: తూచ్... నేను చెప్పిన 'బీబీ'... అది ఇది కాదు: గీతా మాధురి భర్త నందు!

  • నిన్న బిగ్ బాస్ లోకి వెళుతున్నట్టు ప్రకటన
  • నిబంధనల ప్రకారం నడచుకోని నందు
  • నేడు అదేమీ కాదంటూ వివరణ
  • నెటిజన్ల ట్రోలింగ్
That BB is Not Bigg Boss Says Nandu

ప్రముఖ గాయని గీతామాధురి భర్త, నటుడు నందు తాను ఈ సీజన్ బిగ్ బాస్-4లోకి వెళ్లనున్నానన్న సంకేతాలు ఇస్తూ, అభిమానుల సపోర్ట్ తనకు కావాలని నిన్న తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. వాస్తవానికి బిగ్ బాస్ నియమాల ప్రకారం, ఏ కంటెస్టెంట్ కూడా హౌస్ లోకి వెళ్లబోయే ముందు తన పేరును రివీల్ చేయకూడదు. నందు చేసిన కామెంట్ పట్ల బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో అని ఎదురు చూస్తున్న వేళ, నందూ మరో వీడియోను పోస్ట్ చేస్తూ, నెటిజన్లను కన్ఫ్యూజ్ చేశాడు.

తాను చెప్పిన 'బిబి' అంటే అది ఇది కాదన్నాడు. నిన్న ఓ పోస్ట్ పెట్టిన నందు, బుధవారం నాడు మరో అప్ డేట్ ఇస్తానని కూడా చెప్పాడు. అదేంటో అని ఫ్యాన్స్ చూస్తున్న వేళ, ఎవరితోనో మాట్లాడుతున్న మరో వీడియోను నందు పోస్ట్ చేశాడు. "అబ్బే అందులో కాదు సార్... లేదు మనం అప్పుడు అనుకున్నట్టుగా... దాని గురించి అంతే... ఇది అది కాదు" అని మాట్లాడాడు. ఆ వెంటనే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలోని 'అది ఇది కాదు...' అన్న పాటను ప్లే చేశాడు.  దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులను అయోమయంలో పడేసి,తన క్రేజ్ ను పెంచుకోవాలని నందు భావిస్తున్నాడా? అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News