Chennai: లండన్‌లో కిడ్నాపైన చెన్నై యువతి.. ప్రేమ పేరుతో మతం మార్చి బంగ్లాదేశ్‌కు తరలింపు!

Chennai Woman Trapped in London in the name of Love
  • ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన యువతి
  • విడిచిపెట్టేందుకు కోట్లాది రూపాయల డిమాండ్
  • రంగంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన యువకుడు మతం మార్చి బంగ్లాదేశ్‌కు తరలించాడు. ఆ తర్వాత కిడ్నాపర్ ముఠా నుంచి చెన్నైలోని ఆమె కుటుంబానికి బెదిరింపు కాల్స్ రావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడైన యువకుడు నజీష్‌కు అతడి తండ్రి షౌకత్ హుస్సేన్, స్నేహితులు యూనిస్ మాలిక్, నవాజ్‌లతో పాటు మరికొందరు సహకారం అందించినట్టు తేలింది. ఇందుకోసం వీరంతా కలిసి ప్రేమ పేరుతో నాటకం ఆడినట్టు పోలీసులు చెబుతున్నారు.

యువకుడు, అతడి తండ్రి, స్నేహితులతోపాటు జకీర్ నాయక్ అనే వ్యక్తి కలిసి ఈ ప్రేమ నాటకానికి తెరతీసినట్టు తెలుస్తోంది. వీరంతా ముంబై పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నట్టు సమాచారం. యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను విడిచిపెట్టేందుకు కోట్లాది రూపాయలను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యువతి తండ్రికి ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉండడంతో విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగలిగాడు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది.
Chennai
London
Kidnap
Young woman
NIA

More Telugu News