Sudheer Reddy: వైయస్ కుటుంబాన్ని నేను ఎందుకు తిడతాను?: వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Why do I criticise YSR family asks MLA Sudheer Reddy
  • జగన్ వల్లే నేను రాజకీయాల్లోకి వచ్చాను
  • ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు రాజీనామా చేస్తా
  • నాపై అసత్య ప్రచారాలు చేయవద్దు
తాను వైయస్ వారసుడినని... వైసీపీ నుంచి ఎప్పుడూ బయటకు వెళ్లనని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. తన గురించి సోషల్ మీడియాలో వ్యతిరేక వార్తలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని చెప్పారు. జగన్ లేకపోతే తాను రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదని అన్నారు.

తన గెలుపుకు కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డే కారణమని చెప్పారు. అలాంటి కుటుంబాన్ని తాను ఎందుకు తిడతానని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ టికెట్ ఇస్తే నిలబడతానని... తనను జగన్ ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేసేందుకు సిద్ధమని చెప్పారు. తనపై అసత్య ప్రచారాలు చేయవద్దని విన్నవించారు. వైయస్ కుటుంబాన్ని విమర్శించినవారు ఎవరూ బాగుపడలేదని చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై సుధీర్ రెడ్డి 51,941 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, ఆ తర్వాత రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలో చేరడంతో... నేతల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఇద్దరికీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోందనే వార్తలు వస్తున్నాయి.
Sudheer Reddy
YSRCP
Jagan
Jammalamadugu

More Telugu News