Actor Nandu: బిగ్ బాస్ లో హీరో నందు.. మీ సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

Actor Nandu confirms his participation in Bigg Boss Telugu 4
  • డార్లింగ్స్ నేను బిగ్ బాస్ లో ఉన్నా
  • మన రచ్చ మామూలుగా ఉండదు
  • మీ కోసం ఎంతో ఎంటర్టైన్మెంట్ వస్తోంది
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న వారి జాబితా గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, బిగ్ బాస్ లో తాను పాల్గొనబోతున్నట్టు సినీ హీరో నందు క్లారిటీ ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

'డార్లింగ్స్ నేను బిగ్ బాస్ లో ఉన్నా. బిగ్ బాస్ లో మన రచ్చ మామూలుగా ఉండదు. మీ కోసం ఎంతో ఎంటర్టైన్మెంట్ వస్తోంది. మీ సపోర్ట్ కావాలి' అని నందు ఇన్స్టాలో ప్రకటించాడు. అంతేకాదు, మరిన్ని వివరాలను  రేపు సాయంత్రం ప్రకటిస్తానని చెప్పాడు. మరోవైపు, నందు భార్య, సింగర్ గీతామాధురి సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సీజన్ లో ఆమె రన్నరప్ గా నిలిచింది. మరి నందు ఈ సీజన్ లో విజేతగా నిలుస్తాడేమో వేచి చూడాలి.
Actor Nandu
Bigg Boss Telugu 4
Tollywood

More Telugu News