Surekha Vani: బిగ్ బాస్ లో సురేఖవాణి పాల్గొంటోందనే వార్తలపై ఆమె కుమార్తె స్పందన!

Surekha Vani daughter Supritha reacts on her mother entry into Bigg Boss
  • ఆ విషయం గురించి నాకు తెలియదు
  • అమ్మ ఆ విషయం గురించి నాకు చెప్పలేదు
  • నా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే బిగ్ బాస్ సందడి ప్రారంభమైంది. తాజా సీజన్ కు సంబంధించిన ప్రోమోలు కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. మరోవైపు ఈ సీజన్ లో సినీనటి సురేఖవాణి కూడా పాల్గొంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై సురేఖ కూతురు సుప్రీత మాట్లాడుతూ, దీని గురించి తనకు ఏమీ తెలియదని చెప్పింది. ఆ విషయం గురింది తన తల్లి తనకు ఏమీ చెప్పలేదని తెలిపింది. సుప్రీత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె మాట్లాడుతూ పలు విషయాలపై మాట్లాడింది. ప్రస్తుతం తన వయసు 20 ఏళ్లు మాత్రమేనని... పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పింది. తనకు కాబోయే భర్త తనను అర్థం చేసుకునేవాడై ఉండాలని తెలిపింది.
Surekha Vani
Supritha
Daughter
Tollywood
Bigg Boss Telugu 4

More Telugu News